![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -651 లో.... అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే.. రాజ్ కి ఆఫీస్ నుండీ ఫోన్ వస్తుంది. దాంతో రాజ్ అర్జెంట్ గా వెళ్లిపోతాడు. రాజ్ వెళ్లేసరికి సెక్యూరిటీని కొట్టి ఆఫీస్ గోడలకి పెట్రోల్ పోస్తుంటారు రౌడీ లు. రాజ్ వెళ్లి వాళ్ళని పట్టుకోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళు పారిపోతారు. మరొకవైపు ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండడం రుద్రాణి చూడలేకపోతుంది. దాంతో అనామికకి ఫోన్ చేస్తుంది. రేపు ఉదయం కల్లా ఏం జరుగుతుందో చూడు అంటూ అనామిక చెప్తుంది. ఏం చేయబోతున్నావ్ చెప్పమని రుద్రాణి అనగానే.. రేపు నువ్వే చూస్తావ్ కదా అంటూ ఫోన్ కట్ చేస్తుంది.
మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. కావ్య కాఫీ తీసుకొని వచ్చి రాజ్ కి ఇస్తుంటే రాజ్ చిరాకుపడతాడు. ఏంటి అండి నిన్న రాత్రి సడెన్ గా వెళ్ళారని కావ్య అనగానే.. చెప్పాలిసిన అవసరం లేదులని రాజ్ కోపంగా అంటాడు. ఇప్పుడు కావ్య ఏం అందని అలా చిరాకు పడుతున్నావని అపర్ణ అడుగుతుంది. అప్పుడే అప్పు కానిస్టేబుల్స్ తో ఇంటికి వస్తుంది. నిన్నటి నుండి సామంత్ కన్పించడం లేదట.. బావపై అనామిక కంప్లైంట్ ఇచ్చిందని అప్పు అనగానే.. అందరు షాక్ అవుతారు. అప్పుడే అనామిక వచ్చి.. నా సామంత్ ని ఏం చేసావంటూ అడుగుతుంది. కాని స్టేబుల్స్ ఇల్లంతా చెక్ చేస్తారు. సామంత్ ఎక్కడ ఉండడు..
ఇంట్లోనే కాదు బయట కూడా సెర్చ్ చేయాలని అనామిక అనగానే.. కానిస్టేబుల్స్ కి చెప్పి బయట కూడా చెక్ చేయిస్తుంది అప్పు. చివరగా రాజ్ కార్ లో సామంత్ బాడీ ఉంటుంది. దాన్ని చూసి అందరు షాక్ అవుతారు. ఎంత పని చేసావ్ రాజ్.. నా సామంత్ ని చంపేశావని అనామిక అంటుంది. దాంతో రాజ్ ని అరెస్ట్ చెయ్యడానికి అప్పు సిద్ధం అవుతుంది. వద్దని అందరు అంటారు. మీడియా వచ్చింది ఇప్పుడు నేను బంధాల గురించి ఆలోచించొద్దని రాజ్ ని అరెస్ట్ చేస్తుంది అప్పు. తరువాయి భాగంలో ఇలా కరెక్ట్ టైమ్ కి అన్ని ఎలా పాజిబుల్ అవుతాయి. బాడీ దొరకడం.. మీడియా వాళ్ళు రావడం.. ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందని స్టేషన్ లో కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఇదంతా ఎవరు చేసారో కనుక్కుంటానని అనామికతో కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |